Monday, July 1, 2024

Kalki 2898AD | క‌ల్కి ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే..?

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898AD. ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదలైన ఈ చిత్రం.. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌తో సందడి చేస్తోంది. ఈ సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారత సన్నివేశాలు చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. మైథాలజీని సైన్స్ ఫిక్షన్‌తో ముడిపెడుతూ ప్రేక్షుకలకి సరికొత్త అనుభూతిని అందించారు… డైరెక్టర్ నాగ్ అశ్విన్. 

- Advertisement -

దీంతో… కల్కి మూవీ కలెక్షన్స్ ఓ రేంజ్ లోదూసుకుపోతున్నాయి. కల్కి తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 191.5 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. తెలుగులో రూ.70 కోట్లు, హిందీలో రూ.25 కోట్లు, మిగిలిన భాషల్లో రూ.10 కోట్లకు పైగా క‌లెక్ష‌న్లు సాధించింది. భార‌త్‌లో కల్కి సినిమా దాదాపు 115 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement