Saturday, November 23, 2024

అనుష్క ట్వీట్ కు 7 నెలల తరువాత రిప్లయ్ ఇచ్చిన కాజల్

సినీ స్టార్స్ ఏం చేసినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంటాయి. కాగా తాజాగా కాజల్ అగర్వాల్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మామూలుగా కాజల్ అగర్వాల్ ఎవరైనా సెలబ్రిటీలు తననే ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తే….నిమిషాల వ్యవధిలో లేదా గంటల వ్యవధిలో రిప్లై ఇస్తూ ఉంటారు. కానీ అనుష్క తనని ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్ కు ఏడు నెలల తర్వాత రిప్లై ఇచ్చింది. ఇదే విషయమై కాజల్ అగర్వాల్ పై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

పూర్తి వివరాల్లోకి వెళితే ఏడు నెలల క్రితం కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుంది. ఆ సమయంలో చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా కాజల్ కు విషెస్ తెలిపారు. ఆ సమయంలోనే అనుష్క కూడా కాజల్ కు పెళ్లి శుభాకాంక్షలు చెప్పారు. కానీ అప్పటికి అనుష్క కొత్తగా ట్విట్టర్ లో అడుగుపెట్టింది. దాంతో వెరిఫై అవ్వలేదు. కాజల్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో ఆక్టివ్ అయిన అనుష్క ట్విట్టర్ అకౌంట్ వెరిఫై అయింది. దీంతో కాజల్ అనుష్క చేసిన ట్వీట్ కు ఇప్పుడు రిప్లై ఇచ్చింది. లవ్ ఈమోజీ లు పెడుతూ కృతజ్ఞతలు తెలిపింది. ఇక కాజల్ ఇంత ఆలస్యంగా రిప్లై ఇవ్వడంతో నెటిజన్లు సెటైర్లు వేయడం స్టార్ట్ చేశారు.కరోనా తగ్గిన తర్వాత రిప్లై ఇచ్చి ఉంటే బాగుండేదని కొందరు… పిల్లలు పుట్టిన తర్వాత అనుష్క ట్వీట్ కు రిప్లై ఇచ్చి ఉంటే బాగుండేదని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement