కాజల్ అగర్వాల్….దశాబ్ద కాలానికి పైగా ఈ అమ్మడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే ఇటీవల కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల ఎంపిక విషయంలో కాజల్ అగర్వాల్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పెళ్లికి ముందు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అవకాశాలు వచ్చినా చేయటానికి ఆసక్తి చూపించలేదు. కమర్షియల్ సినిమాలకు ఇంట్రెస్ట్ చూపించింది. అయితే ఇప్పుడు మాత్రం ప్రయోగాలు చేయకపోతే నటనకి న్యాయం చేయలేననే ఫీలింగ్ వచ్చి ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేయాలని నిర్ణయం తీసుకుందట.
ఈ నేపథ్యంలోనే పేపర్ బాయ్ సినిమా దర్శకుడు ఉదయశంకర్ దర్శకత్వంలో మెయిల్ లీడ్ రోల్ లో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్టుతో ఓ సినిమా తెరకెక్కబోతుంది. జూలై నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. మరి కాజల్ ఈ సినిమాతో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.