కాజల్ అగర్వాల్ కెరీర్ ను ప్రారంభించి చాలా ఏళ్లు అవుతున్నా ఏ మాత్రం జోష్ తగ్గించలేదు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలను చేస్తోంది కాజల్. గత ఏడాది తన స్నేహితుడు గౌతమ్ ను కాజల్ పెళ్లి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కాజల్ అగర్వాల్ ఇప్పుడు సరికొత్త ప్రయోగాలకు కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఓ తమిళ సినిమాలో తల్లి పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు రౌడీ బేబీ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కథ కొత్తగా అనిపించడంతో కాజల్ గురించి సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని విషయాలు తెలియాల్సి ఉంది.