Friday, October 18, 2024

KA | దీపావ‌ళి కానుక‌గా కిర‌ణ్ అబ్బవరం కొత్త సినిమా !

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో అప్‌కమింగ్ పాన్‌ఇండియన్ మూవీ ‘క’. పీరియాడికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి సుజీత్, సందీప్ దర్శకత్వం వహిస్తుండగా… త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను అలరించబోతోంది. కాగా, తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

దీపావళి కానుకగా అక్టోబర్ 31న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, గ్లింప్స్, టీజర్, సాంగ్ కూడా ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement