Thursday, September 19, 2024

JR.NTR | కాన్స‌ర్ అభిమానికి జూనియ‌ర్ ఫోన్….

కొన్ని రోజులుగా ఎపికి చెందిన కౌశిక్ ఎముక క్యాన్సర్ బాధ పడుతూ తాను ఎక్కువ రోజులు బ్రతకనని అలాగే తాను చనిపోయేలోపు తన అభిమాన హీరో ఎన్టీఆర్ దేవర చిత్రాన్ని చూడాలంటూ ఆమె త‌ల్లి ద్వారా వీడియో సందేశం పంపాడు..దీంతో తన అభిమాని గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ ఈరోజు స్వయంగా తానే తన అభిమానికి వీడియో కాల్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పాడు. ఇందులో భాగంగా తొందర్లోనే క్యాన్సర్ భారినుంచి కోలుకోవాలని తనతో పాటూ తన ఫ్యాన్స్ కూడా అండగా ఉంటామని ధైర్యం చెప్పాడు. అలాగే తొందర్లోనే తనని కలుస్తానని అంతవరకూ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించాడు. దీంతో ఎన్టీఆర్ చేసిన ఈ పనికి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement