జూనియర్ ఎన్టీఆర్ టీనేజ్ లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. హీరోగా తన తొలి సినిమా నిన్ను చూడాలని. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ ఎంత పరితోషికం తీసుకున్నాడనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. తొలి సినిమాకి ఎన్టీఆర్ అందుకున్న పారితోషికం అక్షరాలా 4 లక్షలట. ఆ పారితోషికం చేతికి అందినప్పుడు ఆయన చాలా సంతోష పడిపోయాడు. ఆ పారితోషికాన్ని తీసుకెళ్లి తల్లి చేతిలో పెట్టి ఆమె ఆశీస్సులు అందుకున్నాడు. అయితే తరచూ ఆ డబ్బు తీసుకుని లెక్కపెట్టేసి తిరిగి తల్లికి ఇచ్చేస్తూ ఉండేవాడట. అలాంటి ఎన్టీఆర్ తన కెరియర్ ను మొదలుపెట్టేసి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. ఇప్పుడు ఆయన పారితోషికం కోట్లలో ఉంటుంది.
ఎన్టీఆర్ తొలి పారితోషికం ఎంతో తెలుసా..?
Advertisement
తాజా వార్తలు
Advertisement