టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నేడు చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ సెప్టెంబర్ 20న అరెస్ట్ అయ్యాడు. గత 36 రోజులుగా జైలు జీవితం గడిపిన జానీకి రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో నేడు విడుదల అయ్యారు.
తనపై జానీ మాస్టర్ లైంగికదాడి చేసినట్లు మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సెప్టెంబర్ 16న ఆయనపై నార్సింగి పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. కోర్టు ఆయకు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలులో ఉంటున్నారు. జాతీయ అవార్డుల ప్రదానోత్సవం నేపథ్యంలో ఈ నెల 6 నుంచి 9 వరకు ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గడువు ముగియడంతో ఆయన మళ్లీ జైలుకు వెళ్లారు. కాగా, రెగ్యులర్ బెయిల్ కోసం పోక్సో కోర్టులో దాఖలు చేసిన పిటిషనన్‌ను ఈ నెల 14న కోర్టు తిరస్కరించింది. తాజాగా ఆయనకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. దీంతో ఆయన నేడు చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు.