బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండేజ్ మరోసారి తన మానవత్వాన్ని నిరూపించుకున్నారు. యోలో పేరుతో ఓ ఫౌండేషన్ ప్రారంభించి, పేద కార్మికులకు, మూగ జీవాలకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. జాక్వలైన్ ఓ ఎన్జీవో సంస్థతో కలిసి ఢిల్లీలో గురువారం వలస కార్మికులకు ఆహారం పంపణి చేశారు. కరోనా ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ, లాక్డౌన్ పాక్షిక లాక్డౌన్ అమలులో ఉండడంతో వలస కార్మికులు పనులు లేక తినడానికి తిండి లేక ఇక్కట్లు పడుతున్నారు. ఈ తరుణంలో జాక్వలైన్ తానే స్వయంగా దగ్గరుండి వండిండి, వడ్డించడం విశేషం. జాక్వలిన్ చేస్తున్న సేవను చూసి బాలీవుడ్ ప్రముఖులు అభినందిస్తున్నారు. ముఖ్య నగరాల్లో ఆకలి అన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తామని జాక్వలిన్ తెలిపారు. గత ఏడాది లాక్డౌన్లో సల్మాన్‌ఖాన్‌తో కలిసి పేదలకు నిత్యావసర వస్తువులు పంచి, పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు జాక్వలిన్ ఫెర్నండెజ్.