Friday, November 22, 2024

కొడుకు కోసం ‘RRR’ కథల పుస్తకాన్ని రూపొందించిన జ‌ప‌నీస్ మ‌హిళ‌..

ద‌ర్శ‌క‌ధీరుడు SS రాజమౌళి క్రియేట్ చేసిన విషువ‌ల్ వండ‌ర్ RRR. మూవీ రిలీజ్ అయ్యి ఒక సంవత్సరం పూర్తి అయింది. అయినా కూడా ఈ మూవీపై క్రేజ్ ఇంకా త్గ‌లేదు. అనేక అవార్డులు, రివార్డులు గెలుచుకున్న ఈ సినిమా అంతర్జాతీయ ప్రేక్షకుల దృష్టిని భారతీయ సినిమా పై ప‌డేల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందుకే అంత‌ర్జాతీయ స్థాయిలో ఈ సినిమా ప్రజాదరణ ఇప్పటికే అలానే కొనసాగుతుంది.

అయితే, జపాన్ లోని ఒక‌ మహిళ తన కొడుకు కోసం సినిమా ఆధారంగా ఒక పుస్తకాన్ని రూపొందించింది. జపనీస్ భాషలో వ్రాసిన ఈ పుస్త‌కం సినిమాలోని పాత్రలు, కథ‌ సారాంశాన్ని క‌లిగి ఉంటుంది. మూడు గంటల నిడివి ఉన్న ఈ సినిమాను సబ్ టైటిల్స్‌తో చూడటం తన ఏడు ఏల్ల‌ బిడ్డకు కష్టం అవుతుండ‌ని భావించిన ఈ జ‌ప‌నీస్ మ‌హిళ‌, RRR మూవీకి సంబంధించిన ఇలస్ట్రేటెడ్ కథల పుస్తకాన్ని తయారు చేసింది. కాగా, ప్రస్తుతం ఈ పుస్తకం ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది.

సోష‌ల్ మీడియాలోని ఈ పోస్ట్‌కు విపరీతమైన లైక్‌లు, కామెంట్‌లు వ‌స్తున్నాయి. “ఈ సినిమాని, మన దేశాన్ని ఇంతగా ప్రేమిస్తున్నందుకు ధన్యవాదాలు.” అంటూ ఒక వినియోగ‌దారుడు కామెంట్ చేశాడు. ఆమె కష్టాన్ని, ఆమె కొడుకుపై ఉన్న ప్రేమ‌ను, ఆమె త‌యారు చేసిన ఇల‌స్ట్రేటెడ్ బుక్ ని ప్ర‌శంసిస్తున్న‌రు నెటిజ‌న్లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement