Sunday, July 7, 2024

Suhas | ‘జనక అయితే గనక’ టీజ‌ర్ రిలీజ్..

హీరోగా వ‌రుస విజ‌యాల‌ను అందుకుంటున్న వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ సుహాస్ మ‌రోసారి డిఫ‌రెంట్ మూవీతో అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. సందీప్ రెడ్డి బండ్ల ద‌ర్శ‌క‌త్వంలో సుహాస్ హీరోగా తెర‌కెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ కోర్టు డ్రామా ‘జనక అయితే గనక’. ఈ సినిమాకి హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి నిర్మిస్తున్నారు.

కాగా, తాజాగా ‘జనక అయితే గనక’ టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. టీజ‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ్య‌క్తి త‌న‌కు పుట్ట‌బోయే పిల్ల‌ల విష‌యంలో ఎలాంటి ప్లానింగ్ చేస్తాడు. వారి భ‌విష్య‌త్తు కోసం ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటాడు అనే క‌థాశంతో సినిమాను తెర‌కెక్కించిన‌ట్లుగా టీజ‌ర్‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement