దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకక్కిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సోసియో ఫాంటసీ జానర్లో 1990లో ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఇక చిరంజీవి కెరీర్లో ఈ మూవీ మరో మైల్‌స్టోన్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన చిన్నారులు కూడా తమ నటనతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు.
వారెవరో కాదు తమిళ స్టార్ హీరో అజిత్ భార్య, మాజీ నటి షాలిని…… ఆమె సోదరి నటి షామిలి, ఆమె సోదరుడు రిచర్డ్ రిషి. ఈ ముగ్గురు ఇందులో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి తమదైన నటనతో ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీ 34 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నటి షాలిని త్రోబ్యాక్ ఫోటో షేర్ చేశారు. చిరంజీవితో కలిసి అప్పుడు, ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. బింబిసార ఫేం వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవి కెరీర్లోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, ఆషిక రంగనాథ్, ఈషా చావ్లా, సురభిల ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.