బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ని సంప్రదాయ దుస్తుల్లో కనిపిచడం అన్నది రేర్ గా కూడా జరగదు. అమ్మడు నిత్యం మోడ్రన్ గానే హైలైట్ అవుతుంది. ఇన్స్టా మొత్తం చెక్ చేస్తే ఆ తరహా ఫోటోలే కనిపిస్తాయి. సంప్రదాయ దుస్తుల్లో కనిపించడం అన్నది ఎక్కడో గానీ జరగదు.
అలాంటి బ్యూటీని పట్టుకుని సంప్రదాయ దుస్తుల్లో ఊహించడం అన్నది అనవసరమైన ఆలోచనే. అయితే, అంబానీ ఇంట పెళ్లి కోసం ఎంత అందంగా ముస్తాబైందో తెలిస్తే స్టన్ అవ్వాల్సిందే. అమ్మడు సంప్రదాయ లెహంగా దుస్తుల్లో తళుకులీనిన వైనం చూస్తే మతి పోతుంది.
ఇదిగో ఇక్కడ బ్రౌన్ కలర్ లెహంగాలో ఎంతో చూడ ముచ్చటగా ముస్తాబైంది. మెడలో అమ్మడు ధరించిన హారం..చెవులకు ధరించిన భుట్టలు..చేతికి వేసుకున్న కడియాలు ప్రతీది జాకీని ఎంతో అందంగా తీర్చిది ద్దాయి. ఒక్క క్షణం పాటు ఆమె శ్రీలంక బ్యూటీనా? ఇండియన్ బ్యూటీనా? అన్న సందేహం రాకమానదు. అంత అందంగా లెహంగా దుస్తుల్లో హైలైట్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో అతర్జాలంలో వైరల్ గా మారింది.