ఎటువంటి అంచనాలు లేకుండా ఒక్కసారిగా మంచి హైప్ ను క్రియేట్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం జాతిరత్నాలు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి,ప్రియ దర్శి, రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. నవీన్ పొలిశెట్టి కి జోడీగా ఫరియా అబ్దుల్లా నటించారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.
అయితే కథ విషయానికి వస్తే ఉద్యోగం కోసం సిటీకి వచ్చే ముగ్గురు కుర్రాళ్ల జీవితంలో జరిగిన ఊహించని సంఘటనలను ఫన్నీగా చూపిస్తూ తీసిన తీసిన చిత్రమే జాతి రత్నాలు. ఫస్టాఫ్ మొత్తం ఎంతో సరదాగా సాగిపోతుంది. సెకెండాఫ్ మాత్రం పర్వాలేదనిపిస్తుంది. మొత్తంగా కాసేపు నవ్వుకునే విధంగా సినిమా ఉంటుంది. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ బాగుంది. దానికి తోడు ప్రియదర్శి, రాహుల్ చక్కని జత కావటం మరింత కామెడీ పండింది. ఇక హీరోయిన్ పాత్ర తక్కువే అయినా తనవరకూ ఆకట్టుకుంది. చిన్న పాయింట్‌తోనే తీసినా ఫన్నీగా చూపించడంలో దర్శకుడు ఓకే అనిపించుకున్నాడు. మొత్తానికి అనుకున్నంత స్థాయిలో జాతి రత్నాలు రాణించలేకపోయారు అనే చెప్పాలి.