Saturday, September 28, 2024

జాతి రత్నాలు కలెక్షన్స్ అదుర్స్

శివరాత్రి నాడు రిలీజైన జాతి రత్నాలు’ సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. దాదాపు ఏడు వందలకు పైగా థియేటర్లలో ఇది ప్రదర్శితం అవుతోంది. ప్రీమియర్స్ నుంచే దీనికి మంచి టాక్ రావడంతో స్పందన ఎక్కవ కనిపిస్తోంది దీంతో అన్ని చోట్లా హౌస్‌ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి.

పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌ల కారణంగా ‘జాతి రత్నాలు’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్లు కొల్లగొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రీతిలో రూ. 3.94 కోట్లు షేర్ వసూలు చేసిన ‘జాతి రత్నాలు’.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 8 లక్షలు రాబట్టింది. దీంతో మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.84 కోట్లు షేర్‌తో పాటు రూ. 8.40 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. చిన్న సినిమాగా వచ్చి ఈ రేంజ్ కలెక్షన్లు సాధించడంతో అంతా షాకైపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement