Thursday, October 3, 2024

Bad Newz | ఇద్ద‌రి మ‌ధ్య అగ్గి రాజుకుంది…

‘యానిమ‌ల్’ చిత్రంతో ట్రిప్తి దిమ్రీ ఫేట్ ఓవ‌ర్‌నైట్‌ మారిపోయింది. ‘యానిమల్‌’లో న‌ట‌న‌కు ప్రజాదరణ పొందినప్పటి నుండి అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో ట్రిప్తీ పేరు చర్చనీయాంశమైంది. ఈ విజ‌యం త‌ర్వాత నేష‌న‌ల్ క్ర‌ష్ గా వెలిగిపోతోంది. త‌దుప‌రి వ‌రుస‌గా క్రేజీ చిత్రాల్లో న‌టిస్తూ ట్రిప్తి బిజీ స్టార్ గా మారింది. ఈ భామ‌ త‌దుప‌రి విక్కీ కౌశల్, అమీ విర్క్ ల‌తో క‌లిసి ‘బాడ్ న్యూజ్’లో న‌టించింది. ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుద‌లై మాస్ క్లాస్ వ‌ర్గాల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.

ట్రైల‌ర్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే పాత్ర‌తో మెస్మ‌రైజ్ చేసింది ట్రిప్తి. బాడ్ న్యూజ్ ట్రైలర్ లో జెన్-జెడ్ బి-టౌన్ బ్యూటీ లుక్ గురించి చాలా చ‌ర్చించుకుంది యూత్. ఇప్పుడు ఇదే సినిమా నుంచి సింగిల్స్ విడుద‌ల కానున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి ‘జాన‌మ్..’ అంటూ సాగే పాట‌ను జూలై 9న‌ విడుద‌ల చేయ‌నున్నారు.

ఇదే విష‌యాన్ని రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన తాజా పోస్ట‌ర్, గ్లిప్స్ వైర‌ల్ గా దూసుకెళుతోంది. ఈ పోస్ట‌ర్, వీడియోలో విక్కీతో ట్రిప్తి రొమాంటిక్ ఫోజులు గిలిగింత‌లు పెడుతోంది. పూల్ లో ట్రిప్తి బికినీలో క‌నిపించ‌గా, త‌న‌తో రొమాన్స్ లో బిజీగా ఉన్న విక్కీ కౌశ‌ల్ ఫోజ్ అగ్గి రాజేస్తోంది. ట్రిప్తీ సెన్సిటివ్‌ షిమ్మర్ డ్రెస్ లో హాట్‌గా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్, గ్లిప్స్ ఇంటర్నెట్‌లో వైర‌ల్ గా మారుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement