కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువ అవుతుంది. ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఎక్కడికక్కడే బెడ్స్ లేక కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమయంలో రామానాయుడు స్టూడియోస్ వారు కరోనా పై పోరాటానికి ముందుకు వచ్చారు. విశాఖలో ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేసినట్లు సురేష్ బాబు, అభిరామ్ నుంచి ప్రకటన విడుదలైంది.
కోవిడ్ నియంత్రణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న వైద్యులకు ఉచితంగా ఐసోలేషన్ గదులను ఇవ్వనున్నట్లు తెలిపారు.అయితే కరోనా కారణంగా అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది తమ ప్రాణాలనే పణంగా పెట్టి కరోనా పై పోరాటం చేస్తున్నారు. కాగా ఇటువంటి సమయంలో రామానాయుడు స్టూడియోస్ చేసిన ఈ ప్రకటన పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.