Wednesday, November 20, 2024

రంగ్ దే.. ప్రతీ పాట నాకో చాలెంజ్ – శ్రీమణి

తెలుగు సినీరంగంలో తనదైన ముద్ర వేసిన గీత రచయిత శ్రీమణి. నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న రంగ్ దే’ చిత్రానికి నాలుగు పాటలు రాశారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందించారు. మార్చి 26న విడుదలవుతున్న ‘రంగ్ దే’ సినిమా గురించి, పాటల గురించి శ్రీమణి మీడియాతో ముచ్చటించారు. ‘రంగ్ దే’ సినిమాలో అన్ని పాటలకు మంచి సందర్భాలు కుదిరాయి. చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరితో తొలిప్రేమ’ సినిమా నుండి కలిసి పనిచేస్తున్నాను. ఆయన గేయ రచయితలకు పూర్తి స్వేచ్ఛనిస్తారు. దాంతో లిరిక్ బాగాా రావడానికి ఆస్కారం ఉంటుంది. ‘రంగ్ దే’లో ఒకదానికొకటి భిన్నంగా అనిపించే పాటలు ఉండటం విశేషం. దేవిశ్రీప్రసాద్ గారు ఆల్బమ్ లో పాటలను డిఫరెంట్ గా ఉండేం దుకు ప్రయత్నిస్తారు. రంగ్ దే ఆల్బమ్ అలాంటిదే. నాలుగు పాటలు నాలుగు రకాలుగా ఉంటాయి.

‘రంగ్ దేలో రెండు పాటలుట్యూనతకు లిరిక్స్ రాస్తే, రెండు పాటలకు కాన్సెప్ట్ అనుకుని రాశాక, ట్యూన్స్ కట్టడం జరిగింది. నా కనులు ఎపుడు అనేది క్లాసికల్ కంపోజిషన్. అలాంటి పాటకు ట్యూన్స్ కట్టాక రాస్తేనే బాగుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ గారు స్వతహాగా రైటర్ కూడా. అందువల్ల ట్యూన్ కట్టేప్పుడే కొన్ని పదాలు అనుకుంటారు. వాటిని ఉపయోగించుకుంటూ మేం పాటలు అల్లేస్తుంటాం. రంగ్ దే’ కథ గురించి చెప్పాల్సి వస్తే ఒక అమ్మాయి,అబ్బాయి మధ్య ఎమోషన్స్ ఎలా ఉంటాయనే విషయాన్ని కాంటెంపరరీగా చెప్పేందుకు దర్శకుడు చెప్పారు. పాట అనేది సమిష్టి కృషి ఫలితం.సాహిత్యం, స్వరం, గాత్రం అన్నీ కలిస్తేనే పాట అవుతుంది. పాట పాపులర్ అయితే ఏ ఒక్కరికో దాని క్రెడిట్ ఇవ్వకూడదు. అందరికీ అందులో భాగం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement