కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించిన భారీ హిట్ మూవీ “కాంతారా”. కన్నడ నుంచి డబ్ అయ్యి తెలుగు సహా హిందీ లో కూడా రిలీజ్ అయ్యి ఓ డివోషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా గత ఏడాది వచ్చిన పలు బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ మైవీ సక్సెస్ తో అయితే మేకర్స్ పార్ట్ 2 కూడా ఉటుందని అనౌన్స్ చేశారు. కాగా, ప్రస్తుతం ఈ సినిమాపై కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ సినీ సర్కిల్ లో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ మూవీ పార్ట్ 2 ఉంటుంది కానీ అది కొనసాగింపు సినిమాగా ఉండదట. ఇది కాంతారా కి ప్రీక్వెల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే ఈ ప్రీక్వేల్ సినిమాకి కూడా రిషబ్ దర్శకత్వం వహించనున్నాడట. అంతేకాక ఇక ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ఒకేసారి వచ్చే ఏడాది సమ్మర్ లో తీసుకొచ్చే ఛాన్స్ ఉందని సినీవర్గాల సమాచారం. మరి ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.