వైద్యవైవిధ్యమైన చిత్రాల్లో నటించే హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. తాజాగా ఆయన నటించిన థ్రిల్లర్ చిత్రం ‘గాండీవధారి అర్జున’. సాక్షి వైద్య హీరోయిన్. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం ఇదే నెల 25న విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సాక్షి వైద్య మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలివే..-
నేను నటించిన ఏజెంట్ సినిమా విడుదలకుముందే కొన్ని షాట్స్‌ను ప్రవీణ్ సార్ చూశారు. ఐరా పాత్రకు నేను సరిపోతానని భావించారు. అందుకే తీసుకున్నారు. సినిమాలో మంత్రిగా నాజర్ గారి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటు-ంది. ఆయన పక్కనే కనిపించే నా పాత్ర చాలా బాగుంటు-ంది.- దర్శకులు ప్రవీణ్ గారు సన్నివేశాలను తెరకెక్కించే విధానం ఎంతో క్రియేటివ్‌గా ఉంటాయి. భిన్న రకాలుగా తీస్తుంటారు.- వరుణ్ తేజ్ పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు.. ఎలా ఉంటాడో అని నేను అనుకునేదాన్ని కానీ ఆయన ఎంతో ఒదిగి ఉండేవారు.. నాకు ఈ ప్రయాణంలో ఆయన ఎంతో సాయం చేశారు.
– ఏజెంట్ బాగా ఆడకపోవడం కాస్త బాధ అనిపించింది. టీ-ం ఎంతో కష్టపడి పని చేసింది.. అంత కష్టపడి పని చేసినా ఫెయిల్ అవ్వడం బాధగా అనిపించింది.- ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ గారి సినిమాను చేస్తున్నాను.- దర్శకుడు ప్రవీణ్ గారు చకచకా షూటింగ్ పూర్తి చేయడంతో కనీసం వ్యానిటీ-కి వెళ్లి రెస్ట్ తీసుకునే -టైం కూడా దొరకలేదు. అలా ఫాస్ట్‌గా షూట్ చేయడంతో ఎప్పుడూ ఆ పాత్రలోనే ఉండేదాన్ని.- సమంత చేసిన యశోద లాంటి సినిమాలు, ప్రేమ కథా చిత్రాలు చేయాలని ఉంది. ఈ సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను.- నిర్మాతలు బాపినీడుగారు, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ గారు చాలా మంచి వారు. బాపి గారు ఎప్పుడూ సెట్స్ మీదకు వచ్చేవారు. అందరినీ పలకరించేవారు.- మిక్కీ జే మేయర్ గారి సంగీతం అద్భుతంగా ఉంటు-ంది. ఆయన హిందీలో చేసిన పాటలు నాకు చాలా ఇష్టం. ఈ సినిమాకు మంచి పాటలు ఇచ్చారు.-
తెలుగు ప్రేక్షకులు నన్ను చాలా ప్రేమిస్తున్నారు. తెలుగు భాషను నేర్చుకుని అభిమానుల ప్రేమను తిరిగి ఇస్తాను. నాకు తెలుగులో అల్లు అర్జున్ అంటే ఇష్టం. రామ్ చరణ్ గారు నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాను చూశాను. మా -టైలర్‌ను ఆయన రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. దుల్కర్ సల్మాన్‌తో లక్కీ భాస్కర్, సాయిధరమ్ తేజ్.. సినిమాల్లోనూ నటిస్తున్నాను. రవితేజ గారితోనూ నటించే అవకాశం ఉంది