Friday, October 18, 2024

Indian 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్..

దర్శకుడు శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “ఇండియన్ 2”. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని జూలై 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

కాగా, ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో త్వరలో విడుదల కానుంది. రేపు సాయంత్రం 5:00 గంటలకు పూర్తి పాటను విడుదల చేయనున్నారు. ప్రధాన భారతీయ భాషల్లో ఈ పాటను విడుదల చేయనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా లైకా ప్రొడక్షన్స్ & రెడ్ జెయింట్ మూవీస్ ఈ సినిమా నిర్మిస్తున్నాయి. ఇక‌ ఈ సినిమాలో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement