Friday, November 22, 2024

మళ్ళీ మొదటికే వచ్చిన భారతీయుడు2 వివాదం

సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ భారతీయుడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు అప్పట్లో మంచి వసూళ్లను సాధించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం భారతీయుడు 2 తెరకెక్కుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రారంభమైనప్పటినుంచి నిత్యం ఏదో ఒక వివాదంతో తలెత్తుతూనే ఉంది. దీంతో శంకర్ ఈ సినిమాని పక్కన పెట్టి కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాతలు అయిన లైకా ప్రొడక్షన్స్ వారు కోర్టు కి వెళ్లారు. ఇండియన్ 2 సినిమా చేయకుండా వేరొక సినిమాని ఎలా అనౌన్స్ చేస్తారంటూ నిర్మాతలు కోర్టులో పిటిషన్ వేశారు.

కానీ కోర్ట్ మాత్రం గొడవను సామరస్యంగా తేల్చుకోవాలని ఇరువర్గాలకు సూచించింది. దీంతో శంకర్ తరపు లాయర్ గత శనివారం నిర్మాతలను కలిశారు. ఈ చర్చలలో శంకర్ సినిమాను జూన్ నుండి అక్టోబర్ మధ్యలో కంప్లీట్ చేసి ఇస్తారని చెప్పగా నిర్మాతలు మాత్రం… జూన్ నాటికి ముగించాలని పట్టుబట్టారట. దీంతో సమావేశం సక్సెస్ కాలేదు. ఈ ఇక సమస్య ఇప్పుడు మొదటికే వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement