Friday, November 22, 2024

చిరు ఆక్సిజన్ బ్యాంక్ లకు పెరిగిన ఆదరణ

కరోనా కష్టకాలంలో ఎంతో మంది సినీ ప్రముఖులు పేద ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే కరోనా సమయంలో చాలామంది ఆక్సిజన్ లేక చనిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ కొరతతో ఎవరి ప్రాణాలు పోకూడదని ఆలోచనతో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు జిల్లాలలో ఈ ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. చాలామంది కరోనా బాధితులు ఆక్సిజన్ సిలిండర్లు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఇక్కడ నుంచి తీసుకువెళ్తున్నారు.

కాగా రానున్న రోజుల్లో ఇది మరింత విస్తరించనుంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఏర్పాటు చేసి ఎంతో మందికి సేవ చేస్తున్నారు. కాగా చిరు ఆక్సిజన్ బ్యాంకును పెట్టడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం చిరు ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత వేదాళం ,లూసిఫర్ రీమేక్ లో నటించబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement