హీరోయిన్ పై దర్శకుడు త్రినాథరావు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. కొత్త సినిమా ‘మజాకా’ టీజర్ ఈవెంట్ లో మాట్లాడుతూ… హీరోయిన్ అన్షు శరీరాకృతి గురించి మాట్లాడారు.
దీనిపై సోషల్ మీడియాతో పాటు సినీ పరిశ్రమ నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తన మాటలను వెనక్కి తీసుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో మహిళలకు క్షమాపణలు కూడా చెప్పాడు.
ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఎవరినీ నొప్పించడం తన ఉద్దేశం కాదని అన్నారు. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పేఅని… అందరూ పెద్ద మనసు చేసుకుని తనను క్షమించాలని దర్శకుడు త్రినాథరావు వేడుకున్నాడు.
- Advertisement -