ఉప్పెన సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి. మొదటి సినిమానే కోట్ల రూపాయలు వసూలు సాధించడంతో కృతి శెట్టి కి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కృతికి యాటిట్యూడ్ పెరిగిపోయిందట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఫార్ములాను ఫాలో అవుతుందట. కొత్త ప్రాజెక్ట్ కు ఏకంగా కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తుందట. అంతేకాదు తన తో ఉండే టీంకు కూడా పెద్ద మొత్తంలో ఇవ్వాలని చెబుతోందట కృతి.
నాలుగైదు సినిమాలు హిట్ అయితే ఈ మాత్రం డిమాండ్ చేయడంలో న్యాయం ఉందని ఒక్క సినిమా హిట్ తోనే కృతి ఈ లెవెల్ లో డిమాండ్ చేయడం నిర్మాతలకు ఇబ్బంది గా ఫీల్ అవుతున్నారట. ఇలానే కంటిన్యూ చేస్తే ఫ్యూచర్లో ఇబ్బంది పడాల్సి వస్తుందని ఇప్పటికైనా యాటిట్యూడ్ తగ్గించుకుంటే బాగుంటుందని ఫిల్మ్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.