Tuesday, October 1, 2024

HYD: టాప్ 250 భారతీయ చిత్రాల జాబితాను ప్రకటించిన ఐఎండీబీ…

హైద‌రాబాద్: సినిమాలు, టీవీ షోలు, ప్రముఖుల సమాచారం కోసం ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన ఐఎండిబి (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఎండిబి.కమ్) అక్టోబర్ 2022లో ప్రారంభించిన ఇండియా ఇంస్టాగ్రామ్ హ్యాండిల్లో 2,50,000 మంది ఫాలోవర్లను చేరుకుంది. ఈ మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఐఎండిబి ఆల్ టైమ్ టాప్ 250 హైయెస్ట్ రేటెడ్ ఇండియన్ మూవీస్ లిమిటెడ్ ఎడిషన్ కలెక్టబుల్ పోస్టర్ ను రూపొందించింది. దీనిని ఎంపిక చేసిన ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీ లీడర్లకు బహుమతిగా అందించనున్నారు. దీనితో పాటు ఐఎండిబి ఇండియా ఇంస్టాగ్రామ్ లో ఒక పోటీని నిర్వహిస్తుంది. దీనిలో సెలెక్ట్ అయిన అభిమానులకు ఈ ప్రతిష్టాత్మక పోస్టర్ ను గెలుచుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఈ పోటీ గురించి మరింత తెలుసుకోవడానికి ఐఎండిబి ఇండియా ఇంస్టాగ్రామ్ కు వెళ్లండి.

ఈసంద‌ర్భంగా ఈ జాబితాలో 12వ క్లాస్ ఫెయిల్ టాప్ లో నిలవడంపై తన సంతోషాన్ని పంచుకున్న విక్రాంత్ మాస్సే ఈ చిత్రంలోని అత్యంత హృద్యమైన సన్నివేశాన్ని ఇలా గుర్తుచేసుకున్నారు. త‌న‌కు ఇష్టమైన సన్నివేశం మనోజ్, అతని తల్లి మధ్య చాంపి సన్నివేశం, ఇది మనోజ్ తన అమ్మమ్మ చనిపోయిందని గ్రహించినప్పుడు సినిమాలో కీలకమైన ఘట్టమ‌న్నారు. ఒక్క షాట్ షూట్ చేయడానికి ఎంత ప్లానింగ్, ప్రొడక్షన్ ఉంటుందనేది దీని ప్రత్యేకత అన్నారు. ఈ సన్నివేశంలో బ్యాక్ గ్రౌండ్ లో, మ్యాజిక్ లైట్ తో ఒక తలుపు ఉంది-పగటిపూట రాత్రి కలిసే కాలం, ఇది కేవలం 5 నుండి 7 నిమిషాలు మాత్రమే ఉంటుందన్నారు.

- Advertisement -

విధు వినోద్ చోప్రా సర్, డీఓపీ రంగరాజన్ రామభద్రన్ ఈ మాస్టర్ షాట్ ను నెలల ముందే డిజైన్ చేశారన్నారు. సెట్ లో నటీనటులకు తాము ఖచ్చితంగా చెప్పాల్సి వచ్చిందన్నారు. ఎందుకంటే దానిని క్యాప్చర్ చేయడానికి త‌మకు కొన్నినిమిషాలు మాత్రమే ఉన్నాయన్నారు. భావోద్వేగభరితమైన ఈ సన్నివేశానికి గ్లిజరిన్ వాడకూడదని, ఆ క్షణానికి సాధ్యమైనంత సహజంగా వుండాలని గీత, తాను నిర్ణయించుకున్నామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement