Sunday, September 8, 2024

మ్యూజిక్ ఆల్బ‌మ్ లో ఇలియాన‌.. ఇలా అయిపోయిందేంటి

ఇలియాన అంటే న‌డుము.. న‌డుము అంటే ఇలియానేదే అనేట్టు ఉండేది ఈ బ్యూటీ..ప్ర‌స్తుతం ఇలియాన‌ని చూస్తే అవాక్క‌వాల్సిందే. మ్యూజిక్ వీడియో ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. పాపులర్ ర్యాపర్ బాద్‌షా రూపొందించిన మ్యూజిక్ వీడియోలో ఇలియానా దర్శనమిచ్చింది. బాద్‌షా, గోల్డ్‌కార్ట్‌జ్‌తో కలిసి ఈ వీడియోలో కనిపించింది ఇల్లీ బేబీ. ‘సబ్ గజాబ్ పేరుతో తెరకెక్కిన ఈ వీడియోలో హాట్ అవతార్‌లో కనిపించి తన ట్రేడ్ మార్క్ బెల్లీ డాన్స్‌తో దుమ్మురేపింది. తనలో మునుపటి గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. అయితే డాన్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌లో గ్రేస్ చూపించగలిగినా.. ఆమె బాడీ మాత్రం గతంలో ఉన్నట్లు లేదు. వయసు పెరిగిన చాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలకు జంటగా నటించిన ఇలియాన బాలీవుడ్‌ మీద ఇష్టంతో టాలీవుడ్‌కు హ్యాండిచ్చింది. కానీ అక్కడ కూడా అవకాశాలు అందుకోలేక ఫేడవుట్ అయిపోయింది. హిందీలో నాలుగేళ్ల కిందట నటించిన ‘ది బిగ్ బుల్’ చిత్రమే ఆమెకు చివరది. ఈ క్రమంలోనే కొంతకాలం పర్సనల్ లైఫ్‌లో స్ట్రగుల్స్ ఎదుర్కొన్న అందాల తార.. వాటి నుంచి బయపడి మళ్లీ కెరీర్‌పై ఫోకస్ చేస్తోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement