ఇలియానా డి క్రూజ్ ఇటీవలే బిడ్డకు తల్లి అయిన సంగతి తెలిసిందే. విదేశీ బోయ్ ఫ్రెండ్ మైఖేల్ డోలన్ తో అనుబంధంలో జన్మించిన మగబిడ్డ కోవా పీనిక్స్ డోలన్ తమ ఇంట అవధుల్లేని ఆనందానికి కారణం అయ్యాడని ఇలియానా మురిసిపోతోంది. ప్రసవానంతర జీవితంలో ఎదురయ్యే సవాళ్లను .. భాగస్వామి మైఖేల్‌తో తన బంధం, అతడి నుంచి సపోర్ట్ ఎలాంటిదో కూడా ఇలియానా చర్చించింది. గత ఇబ్బందులను అధిగమించిన తనకు తన కుటుంబానికి డోలన్ అండగా నిలిచాడని కితాబిచ్చేసింది.
2023లో ఇలియానా డిక్రూజ్ – మైఖేల్ డోలన్ తమ మొదటి మగబిడ్డ కోవా ఫీనిక్స్ డోలన్‌ను ప్రపంచంలోకి స్వాగతించారు. అప్పటి నుండి మాతృత్వంలో సరిగమల గురించి తన అభిమానులతో ఇల్లీ అప్‌డేట్‌లను పంచుకుంటోంది. ప్రస్తుతం తన భాగస్వామి మైఖేల్ .. బిడ్డ కోవాతో కలిసి అమెరికాలో నివసిస్తున్న ఇలియానా తాను గర్భధారణ సమయంలో తిరిగి నటనను కొనసాగించాలని మొదట అనుకున్నానని, అయితే కొన్ని సమస్యల వల్ల విరామం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. తన గర్భధారణ సమయంలో నిరంతరం మద్దతునిచ్చినందుకు తన తల్లికి, మైఖేల్ కు కృతజ్ఞతలు తెలిపింది. తన ప్రసవానంతర డిప్రెషన్ గురించి నిక్కచ్చిగా మాట్లాడిన ఇలియానా.. ఈ దశ ఉంటుందని స్త్రీని ఏదీ సిద్ధం చేయలేదని తన అనుభవాన్ని చెప్పింది. తమ మధ్య మూడో వ్యక్తి వల్ల మేఖేల్ ని కోల్పోతున్నానని కూడా ఇలియానా అంది.
మే 2023లో పెళ్లి జరిగే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. ఇలియానా ఆ సీక్రెట్ గురించి ప్రస్థావించలేదు. పబ్లిక్ స్క్రూటినీతో గత ప్రతికూల అనుభవాలను ప్రస్థావిస్తూ.. తన సంబంధాన్ని బహిరంగంగా చర్చించడానికి సంకోచించానని అంగీకరించింది. నా గురించి చెప్పే వాటిని నేను మేనేజ్ చేయగలను. కానీ నా భాగస్వామి లేదా నా కుటుంబం గురించి చెత్తగా మాట్లాడటం నాకు సౌకర్యం అనిపించదు! అని అసహనం వ్యక్తం చేసింది. మళ్ళీ ఇన్నాళ్ళకు మైఖేల్‌పై తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ.. అతడు ఎంతో మనోహరమైన వ్యక్తి అని అన్నారు. అతడి నుంచి అద్భుతమైన మద్దతు లభించిందని తెలిపింది. మైఖేల్‌ని కలవడం నా అదృష్టం. అతడు నా సినిమాల పాటల గురించి తెలుసుకుని, పాటలో సాహిత్యాన్ని కూడా తెలుసుకుని మరీ అతడు పరిచయం పెంచుకోవడం ఆసక్తిగా అనిపించిందని ఇలియానా తెలిపింది. మొత్తానికి ఇలియానాను బాగా అర్థం చేసుకున్న ప్రియుడు మైఖేల్ అని ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. ఆయన గురించి ఇలియానా ఇప్పుడిప్పుడే మనసు విప్పి మాట్లాడుతోంది.