ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కుమార్తె, గాయని భవతారిణి (47) ఇవ్వాల సాయంత్రం శ్రీలంకలో కన్నుమూశారు. కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్న ఆమే చికిత్స పొందేందుకు శ్రీలంక వెళ్లారు. అయితే, పరిస్థితి విషమించి ఇవాళ సాయంత్రం 5 గంటలకు శ్రీలంకలోనే మరణించారు. భవతారిణి భౌతికకాయాన్ని రేపు చెన్నైకి తీసుకువస్తారు. అక్కడే ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు.
భవతారిణి మృతి సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. దాదాపు 30కి పైగా చిత్రాల్లో ఎన్నో పాటలు పాడిన ఆమె గుర్తింపు పొందారు. ‘భారతి’లోని ‘మయిల్ పోల పొన్ను ఒన్ను’ అనే తమిళ పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డు సాధించా. ఇళయరాజా సంగీతం అందించిన రాసయ్య చిత్రంతో ఆమె గాయనిగా అరంగేట్రం చేశారు.