Thursday, November 21, 2024

Allu Arjun: టాప్ గేర్ పై ఐకాన్ స్టార్..

లేటెస్ట్ ట్రెండ్స్ ని అనుసరించ‌డంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌ర్వాతే. టాలీవుడ్ ఫ్యాష‌న్ ఐకాన్‌గా వెలిగిపోతున్నాడు. మార్కెట్లోకి ఏదైనా కొత్త బ్రాండ్ వ‌చ్చిందంటే చాలు అది అత‌డి స్టైల్ స్టేట్‌మెంట్‌లో చేరిపోవాలి. ముఖ్యంగా బ‌న్ని కాస్ట్యూమ్స్ విష‌యంలో త‌గ్గేదేలే! అస్స‌లు రాజీకి రానేరాడు. అత‌డు త‌న కెరీర్ తొలి నాళ్ల నుంచి ఖ‌రీదైన‌ స్పోర్ట్స్ వేర్ ని ధ‌రించేందుకు ఎప్పుడూ ఆస‌క్తిగా ఉన్నాడు. బైక్ కార్ రేస‌ర్లు ధ‌రించే ఆధునిక ట్రెండ్ దుస్తుల‌ను సేక‌రించే అల‌వాటు అత‌డికి ఉంది.

- Advertisement -

ముఖ్యంగా బ‌న్ని విదేశాల్లో త‌న కాస్ట్యూమ్స్ ని షాపింగ్ చేస్తాడ‌ని కూడా టాక్ ఉంది. ముఖ్యంగా సింగపూర్ లోని పాపుల‌ర్ షాపింగ్ మాల్స్ నుంచి బ‌న్ని త‌న డిజైన‌ర్ స్పోర్ట్స్ దుస్తుల‌ను కొనుగోలు చేస్తాడ‌ని టాక్ ఉంది. దానికోసం ల‌క్ష‌లు కోట్ల‌లో ఖ‌ర్చు చేస్తాడ‌ని గుస‌గుస‌లు ఉన్నాయి. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిబిసి టాప్ గేర్ ఇండియా ఫోటోషూట్ లో పాల్గొన్నారు. దీనికోసం అత‌డు అదిరిపోయే కార్ రేస‌ర్ కాస్ట్యూమ్స్ ని ధ‌రించాడు. ఇలా స్టైలిష్ గా ల‌గ్జ‌రీ బ్రాండ్ ఆడి లేటెస్ట్ ఎల‌క్ట్రిక్ కార్ తో ఫోటోషూట్ లో పాల్గొన్నాడు. బీబీసీ టాప్ గేర్ ఇండియా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా స్పెష‌ల్ ఇష్యూని రిలీజ్ చేస్తూ అల్లు అర్జున్ క‌వ‌ర్ ఫోటోతో దీనిని ప‌బ్లిష్ చేయ‌డం ఆస‌క్తిక‌రం. మరో సంవత్సరం, మరొక బ్యాంగర్! .. అన్న క్యాప్ష‌న్ తో ఈ క‌వ‌ర్ ఫోటోని టాప్ గేర్ మ్యాగ‌జైన్ షేర్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement