పలువురు స్టార్ నటీ నటులు వారికి నచ్చిన బిజినెస్ లలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, సమంత, రకుల్ ప్రీత్ సింగ్ ఇలా ఒక్కొకరు తమకి నచ్చిన వ్యాపారాలను ప్రారంభించారు. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించనున్నాడు.త్వరలోనే దుస్తుల వ్యాపారాన్ని అల్లుఅర్జున్ ప్రారంభించబోతున్నాడు. ఇప్పటికే తన బ్రాండ్ నువ్వు AA రూపంలో ప్రమోట్ చేస్తున్న అల్లు అర్జున్… ఇప్పుడు అదే బ్రాండ్ నేమ్ తో దుస్తుల వ్యాపారంలోకి అడుగు పెడుతున్నాడు. వాస్తవానికి ఈ బ్రాండ్ ఇప్పటికే మార్కెట్ లోకి రావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా వాయిదా పడింది. అతి త్వరలోనే ఈ బిజినెస్ ప్రారంభించబోతున్నారు అని సమాచారం. ప్రస్తుతం వరుస సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇక తాజాగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అల్లుఅర్జున్ ఎదిగాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..