Friday, November 22, 2024

నా కోరిక తీరిస్తే డబ్బు ఇస్తా….నటికి ప్రొఫెసర్ మెసేజ్

ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీల పై అసభ్యకరమైన మెసేజ్ లు పోస్టులు ఇలా చాలానే ఎక్కువయ్యాయి. తాజాగా బుల్లితెర నటి సింగర్ సౌందర్య బాలనంద్ కుమార్ కు అసభ్యకర మెసేజ్ లు పెట్టాడు ఓ వ్యక్తి. నా కోరిక తీరిస్తే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తా అంటూ ఓ కాలేజీ ప్రొఫెసర్ సౌందర్యకు మెసేజ్ పెట్టాడు. అయితే ఆ మెసేజ్ లను స్క్రీన్ షాట్ తీసి నెట్టింట్లో పెట్టారు సౌందర్య.

ఇలాంటి వాళ్ళని ఏం చేయాలని ప్రశ్నించింది. ఒక మహిళతో ప్రొఫెసర్ మాట్లాడే విధానం ఇదేనా సిగ్గుచేటు అంటూ సౌందర్య చెప్పుకొచ్చింది. అతడి ప్రొఫైల్ ను బట్టి మధురైకి చెందిన ప్రొఫెసర్ గా తెలుస్తుందని… అతడితో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకొచ్చింది. అతని పూర్తి వివరాలు రాబెడుతున్నానని అన్ని వివరాలు తెలిసిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది. ఇలాంటివారిని ఊరికే వదలకూడదు అని పేర్కొన్నారు సౌందర్య.

Advertisement

తాజా వార్తలు

Advertisement