కొంతకాలం క్రితం తనపై విషప్రమోగం జరిగిందని షాకింగ్ న్యూస్ చెప్పారు నటుడు జేడీ చక్రవర్తి. నాకు స్లో పాయిజన్ ఇచ్చిన మాట వాస్తవం .. కాకపోతే ఎవరు అనేది చెప్పను .. ఆడా .. మగా అనేది కూడా చెప్పను. నేను నాకు వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాను. అలాంటి పరిస్థితుల్లో నెమ్మదిగా నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. అది పెరుగుతూ వెళ్లడం మొదలైంది. ఇక నా పని అయిపోయిందని అనుకున్నాను. నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని కూడా డాక్టర్లకు చెప్పాను” అని అన్నాడు.ఈ సమస్యకి ఇక్కడ పరిష్కారం దొరకలేదు .. దాంతో విదేశాలలో కూడా చూపించుకున్నాను. అయినా సమస్య ఏమిటనేది తేలలేదు. ఈ అనారోగ్య సమస్య తలెత్తక ముందు నేను హెల్దీగా ఉండటం కోసం ఒక కషాయం తాగుతూ ఉండేవాడిని. ఒక వ్యక్తి దానిని తయారుచేసి నాకు పంపించేవాడు. ఒకసారి నాతో పాటు ఆ కషాయం తాగిన వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. ఆ కషాయంలోనే ఎనిమిది నెలలుగా పాయిజన్ కలుపుతూ వచ్చారనే విషయం చివరిలో తేలిందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement