Tuesday, November 26, 2024

ప్రేమ గుడ్డిద‌ని తెలుసు కానీ మ‌రీ ఇంత‌.. రామ్ గోపాల్ వ‌ర్మ‌

నిహారిక కోసం హ‌రి హ‌ర‌కృష్ణ త‌న ఫ్రెండ్ న‌వీన్ ని చంపేశాడ‌ని ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసుపై రామ్ గోపాల్ వర్మ తాజాగా స్పందించారు. ఈ కేసును ప్రస్తావిస్తూ ప్రేమ గుడ్డిదని తెలుసు కానీ మరీ ఇంత గుడ్డిదా.. అని ప్రశ్నించారు. వర్మ ట్వీట్ పై నెటిజన్లు అదే స్టైల్ లో స్పందిస్తున్నారు. మీ సినిమాలకు సరిగ్గా సరిపోయే కథ అని కొంతమంది కామెంట్ చేశారు.నిహారికకు తనకు మధ్య అడ్డొస్తున్నాడనే కోపంతో హరిహరకృష్ణ తన స్నేహితుడు నవీన్ ను అత్యంత దారుణంగా చంపేశాడు. ఆపై శరీరాన్ని చీల్చి, గుండె, మర్మంగాలను కూడా కోసి బయటకు తీశాడు. డెడ్ బాడీ ఆనవాళ్లు గుర్తించకుండా మార్చేసేందుకు ప్రయత్నించాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ప్రస్తుతం ఈ కేసులో హరిహరకృష్ణతో పాటు అతడికి సాయం చేసిన నిహారిక, స్నేహితుడు హసన్ లను పోలీసులు జైలుకు పంపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement