ఉప్పెన సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది హీరోయిన్ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది. ప్రస్తుతం తెలుగులో లో ఈ అమ్మడు చేతిలో మూడు సినిమాలున్నాయి. ఇదిలా ఉండగా ఈ అమ్మడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవిత భాగస్వామి కి సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తనకు అబద్ధం చెప్పే అబ్బాయిలంటే అసలు నచ్చదని నిజాయితీగా ఉండాలని… ఏదైనా తన ముఖం మీద చెప్పే ధైర్యం ఉండాలి అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు శ్యామ్ సింగ్ రాయ్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, అలాగే రామ్, లింగస్వామి సినిమాల్లో నటిస్తోంది.