రేపు మెగా ఫ్యాన్స్ కు పెద్ద పండుగే. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. ఎందుకంటే చిరంజీవి నటించిన ఆచార్య మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వనుంది. దీంతో మెఘా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సాంగ్స్ ట్రైలర్ ఆకట్టుకుని సినిమా మీద అంచనాలను పెంచాయి. చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి రిలీజ్ అయి దాదాపు రెండున్నర సంవత్సరాలైంది. ఆ మూవీ తర్వాత మెగాస్టార్ చేపట్టిన ప్రాజెక్ట్ ఆచార్య.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ మూవీ తీయడం.. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ద అనే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం.. వల్ల భారీగా అంచనాలే ఎర్పడ్డాయి అభిమానుల్లో. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ అన్ని మంచి ప్రశంసలే అందుకున్నాయి. భరత్ అనే నేను సినిమా తర్వాత కొరటాల శివ చేస్తున్న మూవీ కాబట్టి ప్రేక్షకుల అంచనాలు భారీగానే ఉన్నాయి.
విడుదలకు ముందే 140 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసుకున్న ఆచార్య ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1800 థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. కరోనా కారణంగా మూవీ బడ్జెట్ 100 కోట్లకు పైగా అయిందట.. ధర్మస్థలి అనే దేవాలయాన్ని దుర్మార్గుల నుంచి పరిరక్షించేందుకు ఇద్దరు నక్సలైట్లు చేసిన యుద్ధమే ఈ సినిమా. విలన్ పాత్రలో సోనూసూద్ కనిపించనున్నాడు. అయితే అన్ని వర్గాలను ఆచార్య సినిమా ఆకట్టుకుంటుందని.. సినిమా సూపర్ హిట్ అవుతుందనే మూవీ టీమ్ ఆశలు పెట్టుకుంది. మరి కొన్ని గంటల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విదుదల కానుంది… ఆచార్య అనుకున్నట్టుగా అదరగొడుతుందా లేదా అన్నది చూడాలి మరి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..