Thursday, September 19, 2024

Devara ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..!

మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ యాక్షన్ డ్రామా మూవీ ‘దేవర’. దర్శకుడు కొరటాల శివ‌ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. కాగా, మ‌రో వారం రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక తాజాగా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేసారు. సెప్టెంబర్ 22న దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని తెలిపారు.

అయితే ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. ‘దేవర’ సినిమా పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ మూవీకి అనిరుధ్ అందించిన‌ సంగీతం ఇప్పటికే సంచలనం సృష్టించింది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement