Tuesday, September 17, 2024

Congress | బజరంగ్ పునియాకు కీలక పదవి..

భారత స్టార్ రెజ్లర్లు ఈరోజు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా, వినేష్ ఫోగట్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది.. దీంతో ఆమె వచ్చే ఎన్నికల్లో హర్యానాలోని జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ పునియాకు కూడా కీలక పదవిని కట్టబెట్టింది. “ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్” వర్కింగ్ ఛైర్మన్‌గా బజరంగ్ పునియాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇద్దరి చేరికతో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement