Tuesday, September 17, 2024

Pawan Kalyan | ”ఓజి” లేటెస్ట్ అప్డేట్….

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంబరాలకు అభిమానులు పెద్దఎత్తున సిద్ధమయ్యారు. రేపు (సెప్టెంబ‌ర్ 2న‌) ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజు కావ‌డంతో… ఈరోజు నుండి “గబ్బర్ సింగ్” రీ-రిలీజ్ హంగామా మొదలైంది. ఇక సుజీత్ దర్శకత్వంలో పవన్ న‌టిస్తున్న మ‌చ్ అవైటెడ్ మూవీ “OG” అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఇప్పుడు ఫైనల్ గా మేకర్స్ నుంచి ఆ అప్డేట్ వచ్చేసింది. పవన్ బర్త్ డేకి బ్లాస్టింగ్ సెలబ్రేషన్స్ ప్లాన్స్ వేశామని… కానీ ప్రస్తుతం వరదల కారణంగా ఆ ప్లాన్ కాస్త వాయిదా పడిందని మేకర్స్ తెలిపారు. అయితే అభిమానుల కోసం ఓజీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను కొత్త పోస్టర్ తో రేపు ప్రకటిస్తామని ప్రకటించారు. ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement