హీరోయిన్స్ కి అయితే గ్లామర్ షో తప్పదు..కానీ నేటి ఆధునిక ప్రపంచంలో సెలబ్రిటీలు..స్టార్ హీరోల భార్యలు కూడా గ్లామర్ షో చేసేందుకు వెనేకాడటం లేదు. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ తన హాట్ అండ్ గ్లామర్ ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు హీరో రానా భార్య మిహికా బజాజ్ తన గ్లామర్ తో కళ్లు చెదిరేలా చేసింది. సినీ ఇండస్ట్రీతో సంబంధం లేని ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పుడు ఏదో పోస్ట్‌తో నెటిజన్లకు టచ్‌లో ఉంటుంది మిహికా. తాజాగా ఈ భామ పోస్ట్ చేసిన ఫొటోలు ఇంటర్నెట్ను చేస్తున్నాయి.హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని టాలెంట్ మిహికా సొంతం. ఈ భామ స్పైసీ, హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. షార్ట్ స్కర్ట్, వన్ శౌల్డర్ టాప్‌లో హొయలుపోతూ కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. ఈ ఫొటోలపై నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. మిహికా ఎప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు అడుగుతున్నారు. అయితే తనకలాంటి ఆసక్తి ఏం లేదని నెటిజన్ల ప్రశ్నకు సమాధానమిచ్చింది.అయితే ఇంత షో చేయాల్సిన అవసరం ఏముందని పలువురు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఎవరి ఇష్టం వారిది.
Advertisement
తాజా వార్తలు
Advertisement