Friday, November 22, 2024

Jitender Reddy : ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన చరిత్ర…

ఉయ్యాల జంపాల, మజ్ను ఫేమ్‌ విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘జితేందర్‌ రెడ్డి’. రాకేష్‌ వర్రె ప్రధాన పాత్రలో నటించారు. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రియా సుమన్‌, చత్రపతి శేఖర్‌, సుబ్బరాజు, రవి ప్రకాష్‌ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్‌ విడుదల కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా నిర్మాత ముదుగంటి రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ తెలుసు కోవాల్సిన చరిత్ర జితేందర్‌ రెడ్డి జీవితం. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తానని విరించిగారు ముందుకు రావడం చాలా ఆనందం అనిపించింది. అదేవిధంగా రాకేష్‌ జితేందర్‌ రెడ్డిగా పాత్రలో జీవించారు. చరిత్ర అంటే జరిగిన నిజాన్ని తెలుసుకోవడం అలాంటి ఒక నిజాన్ని జితేందర్‌ రెడ్డి జీవితాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నామన్నారు.
హీరో రాకేష్‌ వర్రె మాట్లాడుతూ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గా మొదలై మిర్చి, బాహుబలి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గర అయ్యి ఎవరికీ చెప్పొద్దు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. నిర్మాత రవీందర్‌ రెడ్డి గారు తన సోదరుడు జితేందర్‌ రెడ్డి కథని ప్రజలకు చెప్పాలనే తాపత్రయం బాగా నచ్చిందన్నారు.
దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ జితేందర్‌ రెడ్డి గురించి తెలుసుకోవడం కోసం ఆయన గ్రామానికి వెళ్లి ఆయన స్నేహితులతో అక్కడున్న ప్రజలతో ఇంట్రాక్ట్‌ అయ్యి ఎన్నో విషయాలు తెలుసుకుని ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చాన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement