విజయ్ కనకమేడల దర్శకత్వంలో టాలీవుడ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘భైరవం’. ఈ మల్టీస్టారర్ మూవీ ‘భైరవం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్‌లో శ్రీనివాస్, మనోజ్, రోహిత్… హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టారు.
ఈ ముగ్గురు హీరోలతో సరసన… దివ్య పిళ్లై, అదితి శంకర్, ఆనంది హీరోయిన్లుగా నటించారు. అలాగే జయసుధ, ప్రియమణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల స్వరాలు సమకుర్చారు.