Tuesday, November 26, 2024

‘Hi Nanna’ Review | హృద‌యాల‌ను క‌దిలిస్తుంది….కుటుంబాల‌ను మెప్పిస్తుంది..

బ‌లగం…మాన‌వ సంబందాల‌ను ఎంతో హృద్య‌మంగా చిత్రీక‌రించిన ఈ మూవీ ప్ర‌తి ఒక్క‌రిని చూసేలా చేసింది..కుటుంబ నేప‌థ్య మూవీల‌కు ఈ మూవీ మళ్లీ బాట‌లు ప‌రిచింది.. ఇప్పుడు అదే కోవ‌లో నాని, మృణాల్ ఠాకూర్ లు నటించిన హాయ్ నాన్న మూవీ రూపుదిద్ద‌కుంది..తండ్రి, కుమార్తె అనుబంధానికి అమ్మ సెంటిమెంట్ రంగరించి అల్లిన క‌థ‌ను కొత్త దర్శ‌కుడు శౌర్యువ్ ఎక్క‌డ రాజీప‌డ‌కుండా తీయ‌డంలో స‌క్సెస్ సాదించాడు.. ఈ మూవీలో తండ్రి, కుమార్తె మ‌ధ్య బందాన్ని ఎంత బ‌లంగా చూపాడో, మ‌రో రెండు ప్రేమ క‌థ‌లు అంతే అందంగా సెల్యులాయిడ్ పై చిత్రీక‌రించాడు..

క‌థ‌లోకి వ‌స్తే విరాజ్‌(నాని) సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్‌. తనకు కూతురు మాయ(కియారా) స్కూల్‌ చదువుతుంది. వృత్తిరిత్య బిజీగా ఉన్నా తనకోసం టైమ్‌ కేటాయిస్తాడు. స్టోరీస్‌ చెబుతూ ఎంటర్టైన్‌ చేస్తుంటాడు. తనకు ఏ కథ చెప్పినా అందులో పాత్రలను ఊహించుకోవడం మాయకి అలవాటు. తనకు ఎప్పుడూ డాడీ స్టోరీస్‌ చెబుతున్నాడని, మమ్మీ స్టోరీస్‌ చెప్పాలని మారం చేస్తుంది మాయ. స్టడీస్‌లో ఫస్ట్ వస్తే చెబుతా అంటాడు విరాజ్‌. స్టడీస్‌లో ఫస్ట్ వస్తుంది. అయినా మమ్మి స్టోరీ చెప్పకపోవడంతో మాయ అలుగుతుంది. తన ఫ్లూటో(పెట్‌ డాగ్‌)ని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోతుంది.

ఆ సమయంలో యష్ణ(మృణాల్‌ ఠాకూర్) మాయకి పరిచయం అవుతుంది. యష్ణని నాన్నకి పరిచయం చేస్తుంది మాయ. ఇద్దరు ఫ్రెండ్స్ అవుతుంది. ఆ సమయంలో మమ్మీ స్టోరీ చెప్పాలని ఫోర్స్ చేయడంతో, విరాజ్‌ మమ్మీ స్టోరీ చెబుతాడు. ఈ కథలో మమ్మీగా యష్ణని ఊహించుకుంటుంది మాయ. అక్క‌డ నుంచే అస‌లు కథ ప్రారంబ‌మ‌వుతుంది.. య‌ష్ణ కు మ‌రో వారం రోజుల‌లో పెళ్లి.. మాయ అస‌లు మమ్మీ ఎవ‌రు.. విరాజ్ కుమార్తెతో ఎందుకు ఒంట‌రిగా ఉంటున్నాడు.. అనేది తెర‌పై చూడాల్సిందే..నాని, మృణాల్, చిన్నారి కియ‌రాలు న‌ట‌న‌తో అంద‌ర్ని ఆక‌ట్టుకున్నారు.. ముఖ్యంగా బావోద్యేగాల స‌న్నివేశాల‌లో ఈ ముగ్గురి న‌ట‌న హైలెట్..మూవీ నెమ్మ‌దిగా సాగినా కుటుంబ స‌మేతంగా చూడ‌త‌గ్గ‌మూవీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement