నేచురల్ స్టార్ నాని తొలిసారిగా మృణాల్ ఠాకూర్‌తో జతకట్టిన మూవీ హాయ్ నాన్న . ఈ ఫ్యామిలీ డ్రామాకి శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ప్రమోషన్లు శరవేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మృణాల్ మాట్లాడుతూ, హాయ్ నాన్నలో తన పాత్ర తన కెరీర్లో అత్యుత్తమమైన వాటిలో ఒకటి అని తెలిపారు.
ఇందులో చాలా లెటర్స్, డీప్ ఎమోషన్స్ ఉన్నాయి అని, నటిగా నేనేం చేయగలనో ఈ చిత్రం తెలియజేస్తుంది అని అన్నారు. ఈ చిత్రంలో బేబీ కియారా కూడా కీలక పాత్ర అని, కియారాతో ఆమె చేసే సన్నివేశాలన్నీ సినిమాలో చాలా ఎమోషనల్‌గా ఉంటాయని మృణాల్ చెప్పారు.