Friday, November 22, 2024

ఎంత‌బిజీగా ఉన్నా రాత్రి ఎనిమిది గంట‌ల‌కే నిద్ర‌పోతా.. న‌య‌న‌తార‌

తాను ఎంత బిజీగా ఉన్నా రాత్రి ఎనిమిది గంట‌ల‌కే నిద్ర‌పోతాన‌ని చెప్పింది స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌. నాలుగు పదులకు దగ్గరవుతున్నా సరే ఆమె ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అంటోంది ఈ బ్యూటీ. పెళ్లి చేసుకొని సరోగసి ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చిన నయనతార ఇప్పటికీ కూడా హీరోయిన్గా నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇంత లేట్ వయసులో కూడా నయనతార ఇంత ఫిట్ గా, స్లిమ్ గా ఉండడానికి కారణం ఏంటి అని ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో వెతకడం మొదలుపెట్టారు. ఇకపోతే నయనతార బరువు తగ్గడానికి ఫిట్నెస్ మైంటైన్ చేయడానికి కారణం ఆమె చేసే జిమ్ వర్కౌట్ , యోగాలే ప్రధాన కారణం అని తెలుస్తోంది. ముఖ్యంగా నయనతార ఫిట్నెస్ కి యోగా బాగా ఉపకరించింది అని.. అందుకే ఆమె ఇంత పర్ఫెక్ట్ ఫిగర్ ను మైంటైన్ చేస్తోందని సమాచారం. ఇకపోతే డైట్ ప్లానింగ్ లో కచ్చితంగా కొబ్బరి నీళ్ళు తప్పకుండా ఉండాల్సిందేనట. రోజూ రెండు గంటలు యోగా చేస్తుందట. అల్పాహారంలో పళ్ళ రసం తప్పనిసరి.. మధ్యాహ్నం భోజనంలో నాన్ వెజ్ , గుడ్డు , కూరగాయలు సమపాళ్లల్లో తీసుకుంటారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement