Friday, November 22, 2024

హీరోయిన్ మెహరిన్ పెళ్లి వాయిదా

హీరోయిన్ మెహరీన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. కృష్ణగాడి వీర ప్రేమగాధ, ఎఫ్ 2, రాజా ది గ్రేట్ వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలలో మెహరీన్ నటించింది. అయితే మెహరీన్ తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ భిష్ణోయ్‌ మనుమడు భవ్య బిష్ణోయ్‌తో తో మెహరీన్ వివాహం జరగనుంది.

మార్చిలో ఈ ఇద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఈ పెళ్లిని ఇప్పుడు వాయిదా వేస్తున్నామని చెప్పుకొచ్చింది మెహరీన్. ఇటీవల ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత కరోనా నుండి కోలుకున్నాను… అయితే ఇంకా ఆ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని దానికి తోడు దేశంలో కూడా కరోనా పరిస్థితులు ఇంకా చక్కబడలేదని…అందుకే వచ్చే ఏడాదికి పెళ్లిని వాయిదా వేసుకున్నట్టు చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement