హీరోయిన్ కీర్తి సురేశ్ ఓ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.కాగా ఓ వ్యక్తితో కీర్తి సురేశ్ కలసి ఉన్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. సదరు వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న ఫర్హాన్ బీన్ లియాఖత్ అని తెలుస్తోంది. లియాఖత్ కు కీర్తి సురేశ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. హ్యాపీ బర్త్ డే ఫర్హానీ.. ఈ ఏడాది నీకు మంచి ఫలితాలు ఇస్తుందని భావిస్తున్నాను’’ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో విషెస్ చెప్పింది. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. నిజానికి వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులని తెలుస్తోంది. నటీ నటులు అసలు పెళ్లి పీటలు ఎక్కే వరకు, వారి వివాహాలకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త ఇలా సంచలనం అవుతూనే ఉంటుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement