సీనియర్ హీరోయిన్ రాధ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. అయితే ఆమె కూతురు కూడా అదే త్రోవ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన జోష్ చిత్రంతో రాధ కుమార్తె కార్తీక నాయర్ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తమిళంలో కో ‘తెలుగులో రంగం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈ అమ్మడికి ఫాలోయింగ్ పెరిగింది. ఆ తర్వాత కన్నడ, మలయాళ భాషలలో కూడా సినిమాలు చేసింది. అయితే అక్కడ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
ఆ తర్వాత తెలుగులో దమ్ము సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టలేకపోయింది. ఆ తరువాత అల్లరి నరేష్ బ్రదర్ అఫ్ బొమ్మాలి చిత్రంలో నటించింది. ఇక 2016లో వా డీల్ లో నటించింది. ఆ తర్వాత ఏ ఒక్క సినిమా చేయలేదు.
అయితే తాజా సమాచారం ప్రకారం కార్తీక సినిమాలకు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవల వ్యాపార రంగం లోకి అడుగుపెట్టారు కార్తీక. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో తన వ్యాపార సంస్థలను అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్లాలని సినిమాలకు గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో ఉన్నారట. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కార్తీక స్పందించాల్సిందే.