Tuesday, November 19, 2024

బాలీవుడ్ పై.. కాజ‌ల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాలీవుడ్ పై హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. పెళ్లి తర్వాత ఇటీవలే సెకండ్‌ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ భామ ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో బిజీగా గడుపుతుంది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్‌ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కాజల్‌ దక్షిణాది సినిమాలు వర్సెస్‌ బాలీవుడ్‌ అనే టాపిక్‌పై స్పందించి.. బాలీవుడ్‌లో నైతికత లోపించింది. దక్షిణాదిలో ఉన్న విలువలు బాలీవుడ్‌లో లేవని తెలిపింది. టాలెంట్‌ ఉంటే దక్షిణాది ప్రేక్షకులు తప్పకుండా అంగీకరిస్తారని కాజల్‌ వెల్లడించింది. తను పుట్టి పెరిగింది ముంబాయి నగరమే అయినా తన కెరీర్‌ మొదలైంది మాత్రం హైదరాబాద్‌లోనేనని చెప్పింది. దక్షిణాది ఇండస్ట్రీలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని, అక్కడ అద్భుతమైన దర్శకులు, టెక్నీషియన్లు ఉన్నారని తెలిపింది. దక్షిణాది నుంచి మంచి కంటెంట్‌ వస్తుందని కొనియాడింది.బాలీవుడ్‌లోనూ తను మంచి సినిమాల్లో నటించినప్పటికీ, దక్షిణాది పరిశ్రమలో ఉన్న నైతికత, విలువలు ఇక్కడ లోపించాయని భావిస్తున్నానంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement