గోవా బ్యూటీ ఇలియానా గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది. ఆ తరువాత టాలీవుడ్ లో ఉన్న చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. ఆ తర్వాత ప్రేమ, డేటింగ్ అంటూ కెరియర్ ను పక్కనపెట్టేసింది. ఆ తర్వాత అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చింది. అయినా ఆ సినిమా సక్సెస్ కాలేదు.
ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇలియానా మాట్లాడుతూ…. చిత్ర పరిశ్రమ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమ చాలా దారుణమైనది. ప్రేక్షకులు ఆదరించినంత వరకే ఇక్కడ మనం రాణిస్తాం. ఒక్కసారి మనల్ని చూసి మొహం తిప్పుకున్నారు అంటే అక్కడ మన మనుగడ కష్టం. అవకాశాలు రావు. నా విషయంలోనూ అదే జరిగింది అంటూ చెప్పుకొచ్చింది ఇలియానా.